ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకునే ఫహద్ ఫాజిల్, ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఓ కొత్త మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫాంటసీ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఫహద్ ఫాజిల్ పాత్ర కూడా ఆసక్తిని పెంచుతోంది.
టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. శశాంక్ యేలేటి ప్రత్యేక కథనం, రాజమౌళి సమర్పణ, ఫహద్ ఫాజిల్ నటన కలయికతో ఈ చిత్రం టాలీవుడ్లో మరో విభిన్నమైన సినిమాగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Post Views: 5








