కొత్తగా విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ల ధరలు సాధారణంగా కొంతకాలానికి తగ్గుతుంటాయి. అయితే ప్రముఖ టెక్ సంస్థ శామ్‌సంగ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. తాజాగా మార్కెట్లోకి వచ్చిన Galaxy M47 5G స్మార్ట్‌ఫోన్ ధరను విడుదలైన కొద్ది రోజులకే పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది.
ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభమైన కేవలం వారం రోజుల్లోనే ఈ ఫోన్ ధరను పెంచడం మొబైల్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పాత మోడళ్ల ధరలు మాత్రమే పెరగడం చూస్తుంటాం. కానీ కొత్తగా లాంచ్ అయిన ఫోన్ ధరను ఇంత త్వరగా పెంచడం అరుదైన పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.
ఈ ధరల పెంపు కారణంగా కొత్త ఫోన్ కొనాలని భావిస్తున్న వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శామ్‌సంగ్ ఈ నిర్ణయానికి గల కారణాలపై అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉండగా, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ లేదా ఇతర వ్యాపార కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








