E-PAPER

ఆదివాసి అస్తిత్వం కోసం అహర్నిశలు పాటుపడిన మహోన్నతుడికి గౌరవ డాక్టరేట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలై 4 (Y7 News)

ఆదివాసీ హక్కులు, గిరిజన సంక్షేమం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాటం సాగించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చందా లింగయ్య దొరకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ (UAU) ఆయనకు డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండ్ లీడర్‌షిప్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

ఆదివాసి అస్తిత్వం, భూ హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం కోసం దశాబ్దాలుగా అహర్నిశలు కృషి చేసిన చందా లింగయ్య దొర సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని యూనివర్సిటీ సెలెక్షన్ కౌన్సిల్ ప్రకటించింది. పుదుచ్చేరిలో నిర్వహించిన యూనివర్సిటీ కాన్వొకేషన్ కార్యక్రమంలో ఆయనకు ఈ డాక్టరేట్‌ను అందజేశారు.

ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమం, విద్యా అవకాశాల విస్తరణకు విశేష కృషి చేసిన లింగయ్య దొర, ప్రస్తుతం కూడా ఆదివాసీ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడిగా, ఆదివాసీ సమాజానికి మార్గదర్శకుడిగా, ప్రజా నాయకుడిగా ఆయన చేసిన సేవలకు ఈ గౌరవ డాక్టరేట్ మరింత గుర్తింపును తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ఆదివాసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, “ఆదివాసీ ముద్దుబిడ్డకు దక్కిన ఈ గౌరవం మొత్తం ఆదివాసీ సమాజానికి గర్వకారణం” అని పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News