కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి రియల్మీ గుడ్ న్యూస్ చెప్పింది. పీ-సిరీస్‌లో భాగంగా ‘రియల్మీ పీ4ఎస్ 5జీ’ని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్మీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆకుపచ్చ, బీజ్-బ్రౌన్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.
ఈ ఫోన్లో శాంసంగ్ M14 ప్యానెల్‌తో కూడిన డిస్ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్, 1,272 × 2,772 పిక్సెల్స్ రిజల్యూషన్, 6,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జీ చిప్సెట్తో పాటు హైపర్‌విజన్+ ఏఐ చిప్‌ను అందించారు.
బ్యాటరీ విషయానికి వస్తే ఏకంగా 8,000mAh సామర్థ్యంతో ఈ ఫోన్ రానుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 50MP డ్యూయల్ AI కెమెరా సెటప్, OIS సపోర్ట్ ఉన్నాయి. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69 రేటింగ్లను అందించారు. ఫుల్ ఛార్జ్‌తో మూడు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.








