పలాస ;
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తర్లాకోట గ్రామంలో గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష వికసిత్ భారత్ – జి రామ్ జి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని చెరువు గట్టుపై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ, రోజువారీ వేతనాన్ని రూ.312గా చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీపీడీసీ చైర్మన్ వజ్జ బాబురావు, విఠల్, మున్నా, కూర్మారావు తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన లక్ష్యాలతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.









