
పలాస, వై7 న్యూస్: పలాస ప్రెస్ క్లబ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (APWJU) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) నాయకులు మహారాణ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పలాస ప్రాంతానికి చెందిన పాత్రికేయులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం యూనియన్ గత ఏడు దశాబ్దాలుగా చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు.

అనంతరం పాత్రికేయుల సమస్యల పరిష్కారం, సంక్షేమ చర్యల అమలుకు సంబంధించి ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 11








