E-PAPER

పశువుల అక్రమ రవాణా.. ముగ్గురి అరెస్ట్

దుమ్ముగూడెం , జూలై 02 (వై 7 న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో పశువుల అక్రమ రవాణా యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ములకపాడు కూడలి వద్ద గురువారం నిర్వహించిన వాహన తనిఖీల్లో 12 పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, నంబర్‌ప్లేట్ లేని వాహనంలో చర్ల నుంచి పండితాపురం వైపు పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. అనుమానం రావడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 12 పశువులు ఉన్నట్లు తేలింది.

ఈ ఘటనకు సంబంధించి పాల్వంచకు చెందిన షేక్ కాశీం, షేక్ హన్ను, వాహన డ్రైవర్ వంశీలపై కేసు నమోదు చేసినట్లు దుమ్ముగూడెం ఎస్సై శ్యాంప్రసాద్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులను భద్రపరిచి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News