
శ్రీకాకుళం జిల్లా, పలాస, వై 7 న్యూస్
తేదీ: జూన్ 28
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జామిదారుపుట్టుగ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇచ్చాపురం నుంచి కంచిలి వైపు వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రమాదం తీవ్రతకు ఆటో పూర్తిగా దెబ్బతింది. మృతుల్లో ఒకరు మల్లిపుట్టుగ గ్రామానికి చెందినవారని, మరో ఇద్దరు రాపాకపుట్టుగ గ్రామానికి చెందినవారని పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
– సీనియర్ రిపోర్టర్ దినేష్








