దుమ్ముగూడెం, జూన్ 28 (వై 7 న్యూస్ తెలుగు );
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గంగోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కే.గంగోలు గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రోజా పాల్గొని, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆశా వర్కర్ సుజాత, అంగన్‌వాడీ టీచర్ రమాదేవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పిలక వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ అవగాహన కల్పించారు.
– రిపోర్టర్ ; దివ్య
Post Views: 18








