E-PAPER

బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించవద్దు

వై 7 న్యూస్ పలాస

కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో విస్తృత తనిఖీలు
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్లాన్ ఇండియా – రెన్యూ రిహాబిలిటేషన్ 3.0 కార్యక్రమం భాగంగా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వ్యాపార సముదాయాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో బాల కార్మికులను గుర్తించడం, అలాగే బడికి వెళ్లని పిల్లలను గుర్తించి పునరావాసం కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ విజయకుమార్, సీఆర్‌ఎంసీ ఉర్నాన అప్పలరాజు, చైల్డ్ హెల్ప్‌లైన్ కౌన్సిలర్ సునీత, బెడ్స్ ఎన్‌జీవో బృంద సభ్యులు స్వాతి, మాధవి, అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News