E-PAPER

మెగా జాబ్ మేళా అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి, పిరినాకి నవీన్

మణుగూరు:
ఈనెల 19వ తేదీన భద్రాద్రి స్టేడియంలో జరగనున్న మెగా జాబ్ మేళాను మండలంలోని నిరుద్యోగ యువతి యువకులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్ విజ్ఞప్తి చేశారు.
మండల నాయకుల సమక్షంలో జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన తెలిపారు.పినపాక నియోజకవర్గ యువతకు 4,000 ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభినందనీయులు. సిఎం రేవంత్ రెడ్డి, సింగరేణి సి&ఎండీ బలరాం లతో సమన్వయం చేసి, దేశవ్యాప్తంగా ఉన్న 100 ప్రముఖ కార్పొరేట్ కంపెనీలను ఈ మేళాకు ఆహ్వానించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం అన్నారు.పినపాక నియోజకవర్గాన్ని సాంకేతికపరంగా అభివృద్ధి చేస్తూనే, నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు కల్పించిన ఘనత పాయం వెంకటేశ్వర్లు దే అని పిరినాకి నవీన్ అన్నారు.
మణుగూరు కాంగ్రెస్ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, మైనార్టీ అధ్యక్షుడు ఎం.డి. రహీం, నాయకులు గాండ్ల సురేష్, బొజ్జా త్రిమూర్తులు, అప్పన నరేష్, కొర్లకుంట అప్పారావు, వాసంశెట్టి వెంకట్రావు, బత్తుల శీను, డేగల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News