E-PAPER

భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. QDENGAకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

వర్షాకాలం ప్రారంభమైతే దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతుంటాయి. ప్రతి ఏడాది వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఊరటనిచ్చే కీలక పరిణామంగా, డెంగ్యూ నివారణ కోసం ‘QDENGA’ వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం లభించింది.

ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే, టీకా తీసుకునే ముందు డెంగ్యూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో డెంగ్యూ వచ్చినవారు అయినా, ఎప్పుడూ డెంగ్యూ రాకపోయినా ఈ టీకాను తీసుకోవచ్చు. దీంతో డెంగ్యూ నివారణలో ఇది ఒక కీలక ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.

QDENGA వ్యాక్సిన్‌ను రెండు డోసులుగా ఇస్తారు. మొదటి డోస్ తీసుకున్న మూడు నెలల తర్వాత రెండో డోస్ వేయించుకోవాలి. ఈ టీకాను చర్మం కింద సబ్‌క్యూటేనియస్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ టకేడా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను 4 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వారికి వినియోగించేందుకు అనుమతించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News