E-PAPER

తెలంగాణ యూట్యూబ్ చానల్ అసోసియేషన్ అడహాక్ కమిటీ ఎన్నికలు పూర్తి

హైదరాబాద్: తెలంగాణ యూట్యూబ్ చానల్ అసోసియేషన్ అడహాక్ కమిటీ ఎన్నికలు శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఇందులో రాష్ట్ర అధ్యక్షులుగా పులిపాటి పాపారావు (Y7 News Telugu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్ష పదవికి ఎం.డి. ఫైసుద్దీన్ (MFSN Channel), జనరల్ సెక్రటరీగా జి. శ్రీనివాస్ (SP Media Telugu), ట్రెజరర్‌గా రామడుగు కొమరన్న (STJ News) బాధ్యతలు చేపట్టనున్నారు.

గౌరవ అధ్యక్షులుగా బైల్‌పాటి జయ గణేష్ (GS 6 News), గౌరవ సలహాదారుగా రామ్ టెంకి శ్రీనివాస్ (NK24 TV) నియమితులయ్యారు.

అసోసియేషన్ ఏర్పాటుతో తెలంగాణలోని యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు మరింత బలమైన వేదిక ఏర్పడుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News