కాకినాడ జూన్ 7 (వై 7 న్యూస్ ప్రతినిధి):
నేడే మెగా యోగా డే కాకినాడ 2 వ టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు ఒక కిలో మీటర్ టైటాన్ షోరూం వరకు 5 వేల నుండి 6 వేల మంది ఉపాధ్యాయు లతో ఉదయం 6.30 గంటల నుండి 9.00 గంటల వరకు పెద్దఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు.
యోగాంధ్ర 2025 కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 7న 5 వేల నుండి 6 వేల మంది ఉపాధ్యాయులతో ఉదయం 6.30 గంటల నుండి 9.00 గంటల వరకు కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు టైటాన్ షోరూం వరకు ఒక కిలో మీటర్ మేర ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలిపారు. మెగా యోగ డే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ నెల ఆరో తేదీ శుక్రవారం రాత్రి 8.00 గంటల నుండి 7 వ తేదీ ఉదయం 10.00 గంటల వరకు మెయిన్ రోడ్డు ట్రాఫిక్ ను నిలుపుదల చేయడం , ప్రత్యామ్నాయ రోడ్లలో వాహనాలను మళ్లించడం పై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులకు, దుకాణాల యజమానులకు ముందుగానే సమాచారం అందించడం జరిగిందని , సాధారణ ప్రజలకు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని పోలీస్ శాఖను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు.
జిల్లా ప్రజలకు ఆరోగ్యవంత మైన జీవనశైలి పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు శనివారం ఉదయం 6.30 గంటల నుంచి 9.00 గంటల వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యోగా కార్యక్రమం కాకినాడ మెయిన్ రోడ్డు 2 వ టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు టైటాన్ షోరూం వరకు ఒక కిలో మీటర్ మేర 5 వేల నుండి 6 వేల మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. .
అదేవిధంగా యోగాంధ్ర 2025 కార్యక్రమం ఈ రోజు శనివారం సూర్య కళామందిర్ లో 200 నుండి 300 మందితో, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో 300 నుండి 400 మందితో ఈ రోజు శనివారం ఉదయం 6.30 గంటల నుంచి 9.00 గంటల వరకు ప్రత్యేక యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు సులభంగా చేయగల యోగా ఆసనాలు, శ్వాస పద్ధతులను నేర్పిస్తా రన్నారు. ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలు , జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ పిలుపునిచ్చారు.