నిధులు లేవా, భూమి లేదా,ఆలస్యం గల కారణాలు తెలపండి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ప్రకటించిన ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రారంభ దశ పనులు ఎప్పుడు మొదలు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
త్వర త్వరగాఇంటిగ్రేటెడ్ స్కూల్ ని నిర్మించాలని ప్రభుత్వానికి, మణుగూరు మండల,అన్ని కుల సంఘాల అఖిలపక్షం డిమాండ్
మణుగూరు .07. జూన్ .2025.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, మణుగూరు మండలంలోని, బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల అఖిలపక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన, మాల మహానాడు అధ్యక్షులు. వేల్పుల నరేష్ మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతి నియోజకవర్గానికి, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేయడం జరిగింది, దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేయడం జరిగిందని, పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు, తెలియపరచడం జరిగిందన్నారు, అందుకు సంతోషంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఎనుముల రేవంత్ రెడ్డి, చిత్రపటానికి పాలాభిషేకాలు చేయడం ఈ విషయంఅందరికీ తెలిసినదే, కానీ ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ఇప్పటివరకు ప్రారంభించకపోవడం ఏమిటని, నిర్మాణానికి గల పనులను జాప్యం చేస్తున్నారని, వారు ఆరోపించారు. ఆలస్యం కు గల కారణాలు తెలియజేయాలని, ఏమైనా లోటు పాటలు ఉంటే సరిచేసుకొని త్వర త్వరగా ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభ పనులు ప్రారంభించాలని ఆయన తెలియజేశారు… ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మణుగూరు మండల అధ్యక్షులు. వీరంకీ వెంకట్రావు మాట్లాడుతూ!
పినపాక నియోజకవర్గానికి కేటాయించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరగా ప్రారంభించవలసిందిగా స్థానిక పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు ని కోరడం జరిగింది . ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన ప్రారంభించాల్సిందిగా , పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా ఆదివాసి ఎస్సీ ఎస్టీ బీసీలు, మైనార్టీ కులాల బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారని, అధిక మోతాదులో ఫీజులు చెల్లించి చదివించే స్తోమత లేనివారికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూలు ఎంతగానో,ఉపయోగపడుతుందని, అందుకని ఈ స్కూల్ యొక్క నిర్మాణ పనులు త్వర త్వరగా నిర్మించాలని, స్థానిక ఎమ్మెల్యే మాయ వెంకటేశ్వర్లు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని కుల సంఘాల తరపున, కోరడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని కులసంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెనుగొండ సాంబశివరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసల చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి, పొదిల వీరబాబు,పూసల సంఘం నాయకులు పొదిల సుబ్బారావు,
కే నరసింహారావు ,ఆదివాసి సేన అధ్యక్షులు ,ఆదివాసి సేన ప్రధాన కార్యదర్శి జే సురేందర్, ప్రసాద్. పి రమేష్. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పోడుతూరి కళ్యాణ్ ,సేవాలాల్ సేన అధ్యక్షులు జి. రవికుమార్ . జి కవిత, ఏ నిర్మల, ఎస్ నాగభూషణం నాయని బ్రహ్మ సంఘం అధ్యక్షులు, గొల్ల కురుమ సంఘ అధ్యక్షులు కంప రవి, పొదిళ్ల వీరబాబు పూసల సంఘ నివేదిక జిల్లా కార్యదర్శి, కనితి సత్యనారాయణ ఆదివాసి సంఘ అధ్యక్షులు, చిట్టి బలిజ సంఘం అధ్యక్షులు జగన్నాధం మణుగూరు మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ వేర్పుల సురేష్ , బానోత్ శాంతి , ముస్లిం మైనార్టీ సంఘం నాయకులు యాకూబ్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.