కాంగ్రెస్ పార్టీ సేవలకు గుర్తింపు – ఎమ్మెల్యే మదన్మోహన్ అభినందనీయ నిర్ణయం
• నీల రవి, ఎల్లారెడ్డి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్
బాన్సువాడ జూన్ 7 వై సెవెన్ న్యూస్
ఎల్లారెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగం శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, నీల రవి ని ఎల్లారెడ్డి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నియమించినట్లు తెలియజేసింది. ఇప్పటి వరకు ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమ కార్యాచరణలో నీల రవి చూపిన నిబద్ధత, కృషిని గుర్తించిన ఎమ్మెల్యే మదన్మోహన్ ఆయనను ఈ బాధ్యతకు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నీల రవి స్పందిస్తూ, ఇన్నాళ్లుగా పట్టణ స్థాయిలో పని చేసిన మమ్మల్ని గుర్తించి మండల కోఆర్డినేటర్ పదవికి నియమించినందుకు ఎమ్మెల్యే మదన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తను ముందుకు తీసుకెళ్లే విధంగా నా బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తాను అని తెలిపారు.
పార్టీ అభివృద్ధికి నీల రవి సేవలు మరింత ఉపయోగపడతాయని, మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమ ప్రాచుర్యం మరింత బలోపేతం అవుతుందని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.