E-PAPER

అధికారుల క్రికెట్ టోర్నమెంట్ లో రన్నర్ అప్ గా నిలిచిన టీం ను అభినందించిన ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్

మణుగూరు, మే 13 వై సెవెన్ న్యూస్

ఈ నెల 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు కొత్తగూడెం ప్రొఫెసర్ జై శంకర్ స్టేడియంలో నిర్వహించిన అధికారుల క్రికెట్ టోర్నమెంట్ 2025 లో సత్తా చాటి రన్నర్ అప్ గా కొత్తగూడెం రీజియన్ అధికారుల టీమ్ నిలిచింది. ఈ టోర్నమెంట్ లో అధికారులతో కూడిన కార్పొరేట్ టీమ్, కొత్తగూడెం రీజియన్ టీమ్, రామగుండం రీజినల్ టీమ్, బెల్లంపల్లి రీజియన్ టీమ్ ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. 11వ తారీఖు జరిగిన ఉత్కంట భరిత ఫైనల్ మ్యాచ్ లో బెల్లంపల్లి రీజియన్ జట్టు అయిదు వికెట్ల తేడాతో కొత్తగూడెం రీజియన్ జట్టు పై విజయం సాధించి cricset – 2025 కప్ సొంతం చేసుకుంది. కొత్తగూడెం రీజియన్ అధికారుల టీమ్ లో పి‌బి అవినాష్ , డి‌వై.పి‌ఎం, మణుగూరు ఓసి్‌పి సారధిగా వ్యవహరించారు. భూక్యా భారత్ కుమార్ సీనియర్ అండర్ మేనేజర్, సాయిల సురేశ్, సీనియర్ ఐటి ప్రోగ్రామ్మర్, బిందు సాగర్, సీనియర్ అండర్ మేనేజర్ మరియు మనోహర్, సీనియర్ అండర్ మేనేజర్ జట్టు సభ్యులుగా బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోనూ రాణించారు. ఈ విజేతలకు డైరెక్టర్( ఈ&ఎం) డి సత్యనారాయణ రావు,జి‌ఎం(సిపి&పి) మనోహర్ విజేతలకు బహుమతులు అందజేయడం జరిగినది.

ఈ‌ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ వారి ఛాంబర్ లో వీరికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో క్రీడాస్పూర్తిని ప్రదర్శిస్తూ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో… ఎస్‌ఓ టు జి‌ఎం డి.శ్యామ్ సుందర్ గారు, డి‌జి‌ఎం(పర్సనల్) ఎస్ రమేశ్ , సర్వే అధికారి సర్వర్ నబీ , తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News