తూప్రాన్ మే13 వై సెవెన్ న్యూస్
జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ( నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్) మెదక్ జిల్లా వైస్ చైర్మన్ గా మల్లేష్ యాదవ్ కు నియామక పత్రం అందజేసినట్లు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎంవిఎల్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తనకు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వైస్ చైర్మన్ గా నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనకు మెదక్ జిల్లా వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన జాతీయ చైర్మన్ డాక్టర్ ఎం వి ఎల్ నాగేశ్వరరావు కు, జాతీయ వినియోగదారుల ఫోరం ప్రచార కమిటీ చైర్మన్ పొట్టపెంజర రమేష్ కు, మెదక్ జిల్లా చైర్మన్ బాలసాయి హరిప్రసాద్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన మల్లేష్ యాదవ్ ను పలువురు అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.









