వికారాబాద్, మే 13 వై సెవెన్ న్యూస్;
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వికలాంగులందరికీ అంత్యోదయ కార్డులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా దోమ మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట సంఘం మండల అధ్యక్షులు చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించిన తాసిల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమస్యల పరిష్కరించకుండా వికలాంగుల ఉద్యమాలను అణచివేసే కుట్రలు చేస్తున్నారని ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజంలో అట్టడుగున ఉండి దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇచ్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని రాష్ట్రంలో ఆసరా పింఛను వచ్చే ప్రతి వికలాంగురికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత్యోదయ కార్డులు మంజూరు చేయడంతోపాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించిన మాదిరిగానే తెలంగాణ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లోను వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సమయంలో చెప్పిన హామీ మేరకు వెంటనే వికలాంగుల పెన్షన్ 6000 కు పెంచడంతోపాటు ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ ఆధ్వర్యంలో సంఘం దోమ మండల అధ్యక్షులు చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ తాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో సంఘం నాయకులు లక్ష్మయ్య చంద్రయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు.









