E-PAPER

తెలంగాణ సొత్తు ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారా?

ఆదివాసీ సొసైటీ ఇసుక ర్యాంప్ లో ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఏం పని

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఇసుక నిభందనలు ఎక్కడ

జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పీఓలు సమాధానం చెప్పాలి..?

ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు

చర్ల, మే 13 వై 7 న్యూస్;

తెలంగాణ సొత్తు ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప రాజు ప్రశ్నించారు.ఆదివాసీ సొసైటీ ఇసుక ర్యాంప్ ల్లో ఆంధ్రోళ్ల పెత్తనం ఏంటని మండిపడ్డారు.సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఆంద్ర కాంట్రాక్టర్లకు తాకట్టు పెడుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే నేడు భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని గొమ్ముగూడెం ,
కుదునూరు,తేగడ సొసైటీ ఇసుక ర్యాంప్ లో ఆంధ్ర కాంట్రాక్టర్ల తిష్ట వేశారన్నారు.ఏజెన్సీ చట్టాలను పాతరేసిన అధికారులు బడాబాబులతో లాలూచీ పడుతున్నారని విమర్శించారు.అందుకు కారణం అక్రమ మైనింగ్ జరుగుతున్న తమకేమీ పట్టనట్ల వ్యవహరించడమే అని విమర్శించారు..
అమయాకులైన ఆదివాసీ ప్రజలను మభ్యపెడుతూ వారి ఉనికిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు.అదే కాకపోతే ఆదివాసీ చట్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.చర్ల మండలంలో జరుగుతున్న ఇసుక దోపిడిపై ఐటిడిఏ పీఓ జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఆదివాసీ సమాజం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆదివాసీ ప్రజలు తమ హక్కులను,చట్టాలను కాపాడుకోవడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు.లేదంటే తమ ప్రాంతంలో తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోందన్నారు.ఇలాగే కొనసాగితే పాలకులు బడాబాబులు కలసి తమ చట్టాలను కాలరాయడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News