E-PAPER

మెటాకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. భారత చట్టాల ప్రకారమే వ్యవహరించాలి

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై కేంద్రం క్షమాపణ కోరగా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ పరిణామాల అనంతరం మెటా సహా అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు అమెరికా రాజ్యాంగం లేదా ఇతర దేశాల నిబంధనల ప్రకారం కాకుండా, భారత రాజ్యాంగం మరియు భారత చట్టాలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇటీవల మెటాకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై కఠిన వైఖరి అవలంబించినట్లు తెలుస్తోంది. భారత చట్టాల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ, దేశంలో పనిచేసే అన్ని డిజిటల్ సంస్థలు స్థానిక నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!