మహిళా టీచర్లను సన్మానించిన డెరైక్టర్ సైనత్ హుస్సేన్
తూప్రాన్, మార్చి, 8. వై సెవెన్ న్యూస్
తూప్రాన్ లోని ఆర్ట్ అండ్ స్మార్ట్ ప్లే స్కూల్ లో మహిళా ధినోత్సవం పురస్కరించుకొని మహిళా టీచర్లను ఆ స్కూల్ డెరైక్టర్ సైనత్ హుస్సేన్ ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సైనత్ హుస్సేన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న నిర్వహించి మహిళల్లో అమ్మ, ఆక్క, చెల్లి తోపాటు మహిళలను గౌరవించడం మనందరి బాధ్యతగా వ్యవహరించి సత్య మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారని, వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు నిస్తోందన్నారు. సాధారణ స్థితి నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధన, స్వాలంభనగా వుంటుందని తెలిపారు. భారత దేశ సంస్కృతుల్లో భాగమైన స్త్రీ నీ గౌరవించడం ఒక సంప్రదాయంగా వస్తోంది అని అన్నారు. రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి మహిళల రాజకీయ, సామాజికహక్కుల పై జాగృతి పెంచే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా టీచర్లు ఎం. మౌనిక, ఎం. రామలక్ష్మి, ఎం. శిరీష, ఎం.డి. షకీల తదితరులు పాల్గొన్నారు.