చర్చల అనంతరం సానుకూల స్పందన
తూప్రాన్, మార్చి, 8. వై సెవెన్ న్యూస్
తూప్రాన్, మనోహరబాధ్ మండలాల
లోకల్ వాహనాలకు టోల్ ఫీజ్ లేకుండా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తూప్రాన్ టోల్ ప్లాజా మేనేజర్ కు బిజెపి ఆధ్వర్యంలో లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు. స్థానిక వాహనాలకు టోల్ ఫీజులకు సంబంధించి గత కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ సమస్యను బిజెపి తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు జానకిరామ్ గౌడ్ తూప్రాన్ టోల్ ప్లాజా మేనేజర్ యాకబ్ కు అధికారిక వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి తూప్రాన్ మరియు చుట్టుపక్కల గ్రామాల నివాసితులకు చెందిన వాహనాలను టోల్ ఛార్జీల నుండి మినహా యించాలని జానకిరామ్ గౌడ్
మేనేజర్ తో జరిగిన చర్చల్లో వివరించారు. లోకల్ వాహనాలు ప్రధానంగా స్థానిక ప్రాంతంలోనే నడుస్తున్నందున, టోల్ ఫీజులు విధించడం వల్ల స్థానిక నివాసితులపై అనవసరమైన ఆర్థిక భారం పడుతుందని ఆయన వాదించారు. స్థానిక వాహనాలకు టోల్ మినహాయింపు అంశం చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంది. చాలా మంది స్థానిక నివాసితులు మరియు ప్రయాణికులు తమ సొంత ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు అయ్యే అదనపు ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అభ్యర్థనను తీవ్రంగా పరిగణించి తూప్రాన్ మరియు మండల వాహనాలను టోల్ చెల్లించకుండానే ప్రయాణించడానికి అనుమతించే వ్యవస్థను అమలు చేయాలని జానకిరామ్ గౌడ్ టోల్ ప్లాజా యాజమాన్యాన్ని కోరారు. స్థానిక నివాసితులు మరియు రవాణా నిర్వాహకులు ఈ చొరవను స్వాగతించారు. టోల్ ప్లాజా అధికారుల నుండి అనుకూలమైన ప్రతిస్పందన లభిస్తుందని ఆశిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిష్కారాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ అసెంబ్లీ కన్వీర్ రామ్మోహన్ గౌడ్, జిల్లా నాయకులు తాటి విట్టల్, మాజీ మండల అధ్యక్షుడు రాముని గారి మహేష్ గౌడ్, కార్తీక్ గౌడ్, రాస్మల్ల వెంకట్, సంతోష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.