E-PAPER

వేయి గొంతులు లక్ష డప్పులతో జనవరి 27 న మాదిగ ల మరో దండోరా

బాన్సువాడ డిసెంబర్,15 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడ మండలం కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలోగరువుల బాలరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం మాదిగలు ఉపకులాలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని గుర్తు చేస్తున్నాం.సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముప్పై ఏళ్ల మాదిగల పోరాటం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధిస్తే దాని అమలుకు అడ్డు పడుతూ కొంతమంది స్వార్ద పర సంపన్న మాల వర్గాలు కుట్రలు చేస్తున్నారని ఎంతమంది అడ్డు వచ్చినా వర్గీకరణ ఆగదని అందుకు యావత్తు మాదిగ జాతి సిద్దం కావాలని పిలుపునిస్తున్నాం.దేశం లో ప్రపంచంలో తమ హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి.కానీ సోదర కులాలకు హక్కులు వద్దు అనే ఉద్యమాన్ని మాల సంపన్నులు చేస్తున్నారని దీనిని యావత్తు సమాజం గమనిస్తున్నదని మీ గుర్తు చేస్తున్నము.ఈరోజు బాన్సువాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ,ఎం ఎస్ పి, ఎం ఎస్ ఎఫ్ ,మరియు అనుబంధ సంఘ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి బాలాపురం లావణ్య ఎం ఎస్ ఎఫ్ ,జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి మాదిగ విజయ్ మాదిగ
ఎం ఆర్ పి ఎస్ బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ నాయకులు గరుగళ్ళ బాలరాజ్. దాకయ్య శివరాజ్ సాయిలు గరుగళ్ల సాయిలు బంగారు రవి గంగాధర్ ఎర్రోళ్ల సాయిలు రమేష్
ఎంఎస్ఎఫ్ నాయకులు. టేకుర్ల శేఖర్ పవన్ సాయిలు దత్తు మహేష్ పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!