E-PAPER

వ్యాపార సముదాయాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

పిట్లం డిసెంబర్ 8 వై సెవెన్ న్యూస్ తెలుగు

పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి ఆదాయం సమకూరేల వ్యాపార సముదాయాలను నిర్మాణం చేపట్టి అద్దెకు ఇవ్వడం జరిగిందన్నారు. దీనివల్ల కొంతమంది నిరుద్యోగులకైనా ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ చీకోటి మనోజ్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, వైస్ ఛైర్మన్ కృష్ణరెడ్డి, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్