వై 7 ప్రతినిధి(కాకినాడ జిల్లా) :
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో ప్రముఖ పుణ్యక్షేత్రం, బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం సందర్బంగా స్వామి వారిని మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిలు సందర్శించుకొన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయశాఖ అధికారులు కలసి తీర్థ, ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ యన్డిఏ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, బిక్కవోలు మండల ఎన్డిఏ నాయకులు, బిక్కవోలు గ్రామ ఎన్డిఏ నాయకులు, కార్యకర్తలు తదితర ప్రభుత్వ యంత్రాంగం పాల్గొన్నారు.
Post Views: 58