మణుగూరు, అక్టోబర్31వై 7న్యూస్
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో గురువారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కు చెందిన బుర్ర సోమేశ్వర్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘ కార్యదర్శిగా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి గా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా బుర్ర సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, దీపావళి కానుకగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నా మీద నమ్మకంతో నియామక పత్రం అందజేశారని, బి సి సంఘంలో తెలంగాణ రాష్ట్ర బి సి కార్యదర్శిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా పూర్తి బాధ్యతలు ఇచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీ సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా తెలిపారని, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న బిసి కులాల వారికి బి సి పదవులు ఇవ్వవలసిందిగా నన్ను కోరారని తెలిపారు.ఈ దీపావళి రోజు ఒక మంచి పదవి ఇచ్చినందుకు సంతోషిస్తున్నానని బీసీల అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేశారు.