బాన్సువాడ సెప్టెంబర్ 25 వై 7న్యూస్ ప్రతినిది;
కొండ గంగారం ప్రతినిది;
బాన్సువాడ పట్టణం కేంద్రంలోని పట్టణ
అక్షర పాఠశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శెట్టి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఈ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. విద్యార్థులు తీసుకోవచ్చిన వివిధ రకాలైన వంటకాలు నోరూరించాయి. ఈ సందర్భంగా చిన్నారులు తీసుకువచ్చిన వివిధ రకాల వంటకాలను రుచి చూసి అభినందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య రక్షణలో ఆహారం పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు. సంతులిత ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని ఆమె తెలిపారు. చిన్నారులకు తల్లిదండ్రులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. వివిధ రకాల మొలకెత్తిన విత్తనాలు, పిండి వంటలు, రొట్టె, రాగి జావా, రాగి అంకటి తోపాటు, ఆరోగ్యకరమైనటువంటి వంటకాలను వివిధ రకాల రక్షణలో ఆహారము వాతయంతో ముఖ్యమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అంజిరెడ్డి,ఉపాధ్యాయులు లావణ్య ,పద్మ ,రేఖ, వణిజ సునీత, లలిత, సుష్మ తదితరు పాల్గొన్నారు