E-PAPER

ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన పెద్దదేవులపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది

నల్గొండ అక్టోబర్ 24 వై7 న్యూస్ ప్రతినిధి;

ఆగస్టు నెలలో15వ ఆర్థిక సంఘం నుండి నిదులు గ్రామ పంచాయతీకి,4 లక్షల 50 వేల రూపాయలు జమ అయినవి ఆ డబ్బులను
గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సిబ్బందికి మూడు నెలల జీతాలు ఇవ్వాల్సిన ఇవ్వకుండా గ్రామపంచాయతీలో పని చేయని వాటికి కొన్ని నకిలీ బిల్లులు పెట్టి డబ్బులు మొత్తం డ్రా చేయడం జరిగినది.. వారిపై తగిన విచారణ చేసి మాకు జీతాలు ఇవ్వాల్సిందిగా మరియు వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం నల్గొండలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చి వారి సమస్యను తెలియజేశారు.
వారి యొక్క సమస్యను విని స్పందించిన జిల్లా కలెక్టరు ,పంచాయతీ రాజ్ అధికారికి ఎంక్వయిరీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పెద్దదేవులపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది సురేష్ శ్రీకాంత్ , నాగరాజు, ఆండాలు సొమ్ము వెంకన్న, ఇరిగి క్రాంతికుమార్ , ఠాకూర్ నరసింహన్ సింగ్,రమేష్ సింగ్ , యనక బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు….

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :