. ఇద్దరు పోలీస్ సభ్యులకు ఐదు లక్షల శాలరీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ అందజేత
. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరికి శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కి మార్పు
. రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి ఇన్సూరెన్స్ అందజేత
జిల్లా ఎస్పీ గౌస్ అలం ఐపీఎస్
అదిలాబాద్ ,సెప్టెంబర్ 24 వై సెవెన్ న్యూస్
ఇరువై నాలుగు గంటలు విధులలో ఉంటూ ప్రజా శ్రేయస్సుకు అహర్నిశలు పాటుపడే పోలీసు యంత్రాంగం బాగోగులు ఇన్సూరెన్స్ విషయాలను జిల్లా పోలీసు అధికారి గౌస్ ఆలం ఐపిఎస్ సునిచితంగా సంపూర్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు శాలరీ ప్యాకేజ్ అకౌంట్ లోకి మార్చడం జరిగింది. ప్రమాదవశాత్తు గాని యాక్సిడెంట్ కారణంగా కానీ సాధారణంగా గాని సిబ్బంది మరణించినట్లయితే త్వరితగతిన ఇన్సూరెన్స్ కుటుంబ సభ్యులకు అందించి చేయూతనందించాలనే సదుద్దేశంతో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరి అకౌంట్లో పోలీస్ శాలరీ ప్యాకేజీకి మార్చడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం హఠాత్ మరణం చెందిన ఆర్ఎస్ఐ జి మారుతి మరియు కే మార్కండేయ కుటుంబ సభ్యులకు చెరి ఐదు లక్షల చొప్పున ఇన్సూరెన్స్ డబ్బులను కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ సంవత్సరం మార్చి 19వ తారీఖున రిజర్వ్ ఇన్స్పెక్టర్ జి మారుతి హఠాత్ మరణం తో కుటుంబ సభ్యులు భార్య జి సాగర్ బాయ్ జి సుభాష్ లకు చేయూతనందించాలని జిల్లా పోలీసు అసోసియేషన్ ద్వారా ఎస్బిఐ బ్యాంకు వారి సహకారంతో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయల చెక్కును అంద చేయడం, అదే విధంగా నేరడిగొండ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న కే మార్కండేయ శివరాత్రి రోజున కుంటాలలో హఠాత్ మరణం చెందడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల శాలరీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ లభించడం ద్వారా భార్య కే కవిత మరియు కొడుకు కే నితిన్ కుమార్లకు, కుటుంబ సభ్యులకు ఎంతగానో చేయూతనందిస్తుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా పోలీస్ శాలరీ ప్యాకేజీ ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధి పొందిన ఇరువురి కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ తన కార్యాలయం నందు ఇరువురి కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేసి కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలకైనా జిల్లా అసోసియేషన్ సభ్యులను జిల్లా పోలీసు ఉన్నతాధికారిని సంప్రదించమని తెలిపారు.