. స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని యజ్ఞంలా పూర్తి చేయాలి
. గ్రామాల్లో మంచి నీటి సహయకులు
. నెలలోపు శిక్షణ పూర్తి
. తాగు నీటి మోటర్ పాడైతే అదే రోజు మరమ్మత్తు
. అధికారులకు మంత్రి సీతక్క దిశా నిర్దేశం
వై సెవెన్ న్యూస్ హైదరాబాద్
తెలంగాణ గ్రామీణా భివృద్ధి మంత్రిత్వశాఖలో విభాగాల వారిగా పనుల్లో వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. విభాగాల వారిగా జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. సచివాలయంలో సోమవారం నాడు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవ రాజన్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ అనితా రామచంద్రన్ స్పెషల్ కమీషనర్ షఫిఉల్లాతో కలిసి మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ హయంలో పెండింగ్ ఉంచిన బిల్లులను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. ఆయా విభాగాల్లో కొనసాగుతున్న పనుల పురోగతిని తెలుసుకున్నారు. విభాగాల వారిగా నూతన పనులకు కార్యచరణ సిద్దం చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. హెఓడీలతో సమీక్ష అనంతరం డీఆర్ డీఓ అడిషన్ డీఆర్డీఓ డీపీఓ లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామల్లో స్వచ్చ దనం పచ్చదనం కార్యక్రమానికి కొనసాగింపుగా స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు అధికారులంతా జవాబుదారిగా వ్యవహరించానలి కోరారు. జిల్లాల్లో ప్రతి రోజు చేపట్టిన కార్యక్రమాల వివరాలను అన్ లైన్ లో ఎంట్రి చేయాలన్నారు రాబోయే పది రోజుల్లో స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని ఒక యజ్నంలా కొనసాగించాలని ఆదేశాలు జారిచే సారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం పెంచాలని కోరారు. జాతీయ స్థాయిలో స్వచ్చతా హీ సేవా విభాగంలో రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేలా కృషి చేయాలని ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి మంచి సరఫారా విషయంలో నూతన ఒరవడికి తమ ప్రభుత్వం నాంది పలికిందని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ మంచినీటి సహయకుడి ని నియమించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.15 జిల్లాల్లో 60 ప్రాంతాల్లో శిక్షణ కొనసాగుతుందని ఈ నెల లోపు అన్ని గ్రామాలకు సహయకులను నియమించి శిక్షణ పూర్తి చేస్తామన్నారు. తాగునీటి నాణ్యతను నిర్వహించడంతోపాటు బోర్లు పాడైతే అదే రోజు మరమ్మత్తులు జరిగేలా పైపులు లీకైతే సరిచేసేలా గ్రామాల్లో మంచినీటి సహయకులు కృషి చేస్తారని తెలిపారు.