E-PAPER

వైయస్సార్ వర్దంతి;ఘనంగా నివాళులర్పించిన బూర్గంపాడు కాంగ్రెస్ నాయకులు

బూర్గంపాడు,సెప్టెంబర్02

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో ఈ వేడుకలు నిర్వహించి.. ఆయనకు నివాళులర్పించారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు సోమవారం ఘనంగా నిర్వహించారు సారపాక సెంటర్లో ఉన్నటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బూర్గంపాడు మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ..నీ పాద ముద్ర ప్రజల హృదయంలో నిద్ర చేసినది…జోహార్ వైస్సార్ రాజన్న అని కొనియాడారు. అదే విధంగా ప్రియతమ నాయకుడు మచ్చలేని మహామనిషి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించారంటే ఇంకా నమ్మలేకున్నామన్నారు. ప్రజలకు చేరువయ్యే పలు సంక్షేమ పథకాలు ప్రారంభించి చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఇప్పుడున్న ప్రతి నాయకుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని, అలాంటి పరిపాలన అందించిన ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో.. డిసిసి మైనార్టీ సెల్ చైర్మన్ మహిముద్ ఖాన్,పీసీసీ సభ్యులు తాళ్లూరి చక్రవర్తి, కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అద్యక్షులు బెల్లంకొండ వాసుదేవరావు, గోల్మా రత్నారెడ్డి, జింకల దామోదర్ రెడ్డి, చిల్లంకూరు భాస్కరరావు, కాట వెంకటరామిరెడ్డి, ప్రభాకర్,గుంటగ శేషి రెడ్డి, నరసింహారావు,టి గురవయ్య, ముంగిలాల్ సూరత్, వెంకట్రావు, మండల కమిటీ సభ్యురాలు కర్రి కామేశ్వరి, తేజ దేవి, సిహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :