జనగామ,ఆగస్టు27 (వై 7న్యూస్)
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో బహుజన పూజారుల శివసత్తుల సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ,రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబురావు మహారాజ్ మాట్లాడుతూ ,తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలైన, శివశక్తులను గుర్తించి జీవన భృతి ఇవ్వాలని,ఎన్నికలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారికి పదివేల జీవనభృతి కల్పించాలని,బహుజన పూజారుల శివశక్తులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి సహాయపడాలని ,శివశక్తుల సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి ధూప దీప నైవేద్య పథకం గ్రామీణ ప్రాంత శివశక్తులకు అమలు చేయాలన్నారు.
తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు మూలాలు అయిన శివశక్తులను గుర్తించి ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని, బ్రాహ్మణులతో సమాన గౌరవాన్ని కల్పించాలన్నారు.బహుజన పూజారులకు శివశక్తులకు 10 శాతం రిజర్వేషన్,
దైవదర్శనాలలో వారికి విఐపి దర్శనం సౌకర్యం,వారికి ఇందిరమ్మ గృహకల్పన పథకా అమలు చేయాలాన్నారు తెలంగాణ రాష్ట్ర పండుగలు ,బోనాలు, బతుకమ్మ లకు గుర్తించిన ప్రభుత్వం ,వాటికి మూలాలు అయినా శివశక్తులను గుర్తించి వారిని ఆదుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహుజన పూజారుల శివశక్తుల సేవా సమితి పై డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షులు పద్మ ,ఐలమ్మ ఉప్పమ్మ ,భుజేంద్ర ,రాజమ్మ పార్వతి ,బిక్కమ్మ ,రాష్ట్ర కమిటీ సభ్యులు దూదిగాని సంపత్ ,భుజేంద్రం ,అరుణమ్మ మండల కమిటీ సభ్యులు శివశక్తులు తదితరులు పాల్గొన్నారు.