E-PAPER

యునైటెడ్ పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాం; బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు వెల్లడి

కామారెడ్డి జిల్లా
వై 7 న్యూస్ తెలుగు పత్రిక
ఆగస్టు: 25-08-2024

నసుల్లాబాద్ మండల కేంద్రంలో జిల్లా అధికార ప్రతినిధి చందూరు హనుమాన్లు మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యునైటెడ్ పెన్షన్ స్కీమ్ (యు పి ఎస్) ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం సమావేశమైన ఈ కేబినెట్ పలు కీలక తీర్మానాలను ఆమోదించింది.
కేబినెట్ ఆమోదం పొందిన తీర్మానాల్లో ఒకటి- యూపీఎస్. ఈ పథకం వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీన దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది.ఎన్‌పీఎస్ కంటే భిన్నం..
2024పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ర్థిక ప్రయోజనాలను కల్పించడానికి ప్రస్తుతం ఎన్‌పీఎస్ అమలులో ఉంది. దీనికంటే మరింత మెరుగ్గా వారికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించేలా యూపీఎస్‌కు రూపకల్పన చేసింది కేంద్రం.
ఉద్యోగులకు ఒకే సారి రెండు పెండింగ్ డీఏల విడుదల..
పదవీ విరమణ చేయడానికి చివరి 12 నెలల్లో సదరు ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్న జీతంలో యావరేజ్ బేసిక్‌ శాలరీ ఆధారంగా కేంద్రం ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది. యావరేజ్ బేసిక్ వేతనంలో 50 శాతం మొత్తాన్ని యూపీఎస్ ద్వారా గ్యారెంటీ పెన్షన్‌గా అందిస్తుంది.
యూపీఎస్ అమలు విషయంలో ఉద్యోగులు పని చేసిన కాలాన్ని మూడు కేటగిరీలుగా విభజించింది. 25 సంవత్సరాలకు పైగా సర్వీసు ఉన్న వారు, 10 నుంచి 25 సంవత్సరాలు, 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్లుగా కేటగిరి చేసింది. పింఛన్ అమలులో దీన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది.
రూ.10 వేల కనీస పెన్షన్..
పదేళ్ల వరకు సర్వీస్ కాలం ఉన్న వారికి దామాషా పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. 10 నుంచి 25 సంవత్సరాల మధ్య సర్వీస్ ఉండి పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కింద ప్రతి నెలా 10,000 రూపాయల మొత్తాన్ని గ్యారంటీ పెన్షన్‌‌గా అందుతుంది.
కుటుంబ సభ్యులకు..
పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణించిన తరువాత కుటుంబ సభ్యులకు అందజేసే పింఛన్ మొత్తాన్ని 60 శాతం వరకు పెంచింది. అంటే సదరు ఉద్యోగి చివరిగా తీసుకున్న పెన్షన్‌ మొత్తంలో 60 శాతం మొత్తాన్ని గ్యారంటీ పెన్షన్‌గా కుటుంబ సభ్యులకు చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం
డీఏలతో కలిపి..రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికీ డీఏ మొత్తాన్ని అన్ చెల్లిస్తుంది. పారిశ్రామిక రంగంలో పని చేస్తోన్న ఉద్యోగుల వేతనాలను పెంచడానికి అనుసరించే ప్రైస్ ఇండెక్స్‌ను దీనికోసం పరిగణనలోకి తీసుకుంటుంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్