E-PAPER

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

భైంసా; స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బిజెపి ముధోల్ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ అన్నారు. సోమవారం భైంసా లోని ఎస్. ఎస్. జిన్నింగ్ ఫాక్టరీ లో నిర్వహించిన బైంసా మండల బిజెపి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. ప్రభుత్వ ఏర్పడి ఎనిమిది నెలలైనా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రేషన్ కార్డు నిబంధన విధిస్తూ ప్రభుత్వం తప్పించుకునే యోచనలో ఉందన్నారు . కార్యకర్తలు నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కారం కోసం పాటుపడాలన్నారు. ప్రజా సేవే ధ్యేయంగా పనిచేసిన వారికి ఎన్నికల్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ సహకారంతో గ్రామాల అభివృద్ధి పై దృష్టిసారించాల్సిందిగా సూచించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, నాయకులు సోలంకి బీంరావ్పటేల్ , బాజీ రావ్ పటేల్ , పండిత్ రావ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సర్దా, బిజెపి మండల అధ్యక్షులు భూమేష్, మండల ప్రధాన కార్యదర్శి అశోక్,బాలు , అప్పాల రాకేష్ , సుధాకర్ , సాయి , మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, పి. ఎ. సి. ఎస్. డైరెక్టర్ లస్మన్న. మాజీ ఎం పి టి సి లు, మాజీ సర్పంచ్ లు. వివిధ మోర్చాల నాయకులు, బూత్ ఇంచార్జి లు కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News