పూర్తి కావస్తున్న ఇండ్ల నిర్మాణ పనులు
హుజూర్ నగర్లో అభివృద్ధి వెలుగులు
* పరుగులు పెడుతున్న పనులు.. తీరనున్న పేదల సొంతింటి కల
* ఫణిగిరి మోడల్ కాలనీలో ముమ్మరంగా నిర్మాణాలు
* మంత్రి ఉత్తమ్ కృషితో తీరనున్న వెతలు
* రూ.74.80కోట్ల నిధులతో పూర్తి కావస్తున్న 2,060 గృహాలు
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి సీతారామచంద్రస్వామి గుట్ట కాలనీ వద్ద 2012 కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండ్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలనే సంకల్పంతో..
దేవదాయ శాఖ నుండి భూములను కొనుగోలు చేశారు. వాటిలో ఆధునిక ఫణిగిరి కాలనీగా మార్చి ఇండ్లు లేని నిరుపేదలకు వ్యక్తిగత ఇండ్లు నిర్మించి అందజేయడం తో పాటు రాజీవ్ స్వగృహ పేరుతో సామూహిక ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వాలని పనులు జరుగుతున్న నేపథ్యంలో 2014లో ఎన్నికల రావడం టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో గృహ నిర్మాణాల సముదాయం మధ్యలోనే అసంపూర్తిగా అగిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ 10సంవత్సరాల పాలన కాలంలో మోడల్ కాలనీ ఇండ్ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ దానిని విస్మరించారు. 2023 డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఫణిగిరి మోడల్ కాలనీ ఇండ్ల నిర్మాణాలపై దృష్టి సారించారు.









