అశ్వాపురం, జూన్ 29 (వై7 న్యూస్): సహకార వారోత్సవాల సందర్భంగా సోమవారం అశ్వాపురం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సహకార జెండాను సంఘ సెక్రటరీ కె. వెంకటేశ్వర్లు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలు రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకంగా దోహదపడుతున్నాయని అన్నారు. రైతులు సహకార సంఘం ద్వారా అందిస్తున్న రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర సేవలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాభివృద్ధి సాధించాలని సూచించారు.
సహకార స్ఫూర్తిని ప్రతి రైతు అలవరుచుకోవాలని, సంఘాల బలోపేతానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం సహకార సంఘం సిబ్బంది, రైతులు సహకార జెండాకు వందనం చేసి సహకార ఉద్యమం పట్ల తమ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6








