పలాస, వై7 న్యూస్:
శ్రీకాకుళం జిల్లా రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. సోమవారం లావేరు మండలంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు దీర్ఘకాలిక పంటల కంటే తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించడంతో పాటు నేల సారవంతత కూడా పెరుగుతుందని తెలిపారు.
రైతులు ఆధునిక సాంకేతికతతో పాటు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి స్థిరమైన ఆదాయాన్ని పొందాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Post Views: 9








