E-PAPER

వాగ్దానాన్నిటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి; CPIML మాస్ లైన్ పార్టీ డిమాండ్

*ఆగస్టు 1న తాసిల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా మొత్తం ధర్నాలు జరపండి

*భద్రాచలంలో పోస్టల్ ఆవిష్కరణ.

*కెచ్చల రంగా రెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు

భద్రాచలం; కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పలు వాగ్దానాలు చేసింది ఏడు నెలలు గడిచిపోయిన అమలుకు చర్యలు కనబడడం లేదు కనుక ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని సోమవారం భద్రాచలం CPIML మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో పోస్టల్ ఆవిష్కరించారు.అనంతరం CPIML మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి మాట్లాడుతూ,ముఖ్యంగా వరద బాదితులని ఆదుకోవాలని, నిరుద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం పట్టించి, జాబ్ కేలండర్ విడుదల చేయాలని, పోడు సాగుదారులందరికి పట్టాలు సాగు హక్కు పత్రాలు కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, అర్హులైన పేదలకు ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, రైతాంగ రుణాలను రద్దు చేయడంతో పాటు వారికి కొత్త రుణాలు ఇవ్వాలని, పంట బీమా పథకం జూలై ఆగస్టు నెలలోనే అమలు చేయాలని, వాస్తవ సాగుదారులకి రైతు భరోసా అందించాలి 20 ఎకరాల లోపు ఉన్నవారిని, ఎంపిక చేసి పది ఎకరాల వరకు రైతు భరోసా అందించాలని, అలాగే కౌలు రైతులకు గుర్తింపునకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని, ధరణి సమస్యలను తక్షణమే పూర్తిగా పరిష్కరించాలని వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన 12,000 ఆసరా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని దీనిని కూడా జీవన వ్యాయానికి అనుగుణంగా పెంచాలని, నిర్మాణ రంగ కార్మికులు ఇతర అసంఘటిత కార్మికులకు కూడా ఆశ్ర పథకాన్ని అమలు చేయాలని, స్కాలర్షిప్ ఫీజు రివర్స్ విడుదల చేయాలని, ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఒకటిన తాసిల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎనిమిదో తారీఖున నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. సమాచారం నిమిత్తం వేసిన పోస్టర్లు లను భద్రాచలంలోని అశోక్ నగర్ గల పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో CPIML జిల్లా నాయకురాలు KETCHELA కల్పన. డివిజన్ నాయకులు కొండా చరణ్, మునిగల శివ ప్రశాంత్, సాయన్న,మహేశ్వరి, దుర్గ భవాని, కుమారి, వన్నాల రవికుమార్, స్వాతి, సుహాసిని, రేవతి, కృష్ణవేణి, జయమ్మ, షకీరా, రమాదేవి, మానస, వరలక్ష్మి, ఫిర్దోస్, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News