E-PAPER

అడవి బిడ్డల ఆకలి తీర్చిన దానదర్మ ట్రస్ట్ నిర్వాహకురాలు గంట రాద..

మణుగూరు: కడుపు నిండా అన్నం దొరకని పేదల ఆకలి తీరుస్తున్నారు ఆ ట్రస్ట్ నిర్వాహకురాలు. ఉన్నది వెనుకబడిన జిల్లాలో అయినప్పటికి ఏజెన్సీ, ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్లి మరీ అడవి బిడ్డలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.వివరాల్లోకి వెళ్ళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన దానధర్మ ట్రస్ట్ నిర్వాహకురాలు గంట రాధా రేగులగండి ఆటవి ప్రాంతంలో
అడవి బిడ్డలకు ఆకలి తీర్చింది. సమాజానికి దూరంగా అడవికి దగ్గరగా ఆదివాసీలు జీవిస్తున్నారని వీరికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదనీ, రోడ్ల సదుపాయం విద్యుత్ సదుపాయం కూడా లేదని అన్నారు..
ఇలాంటి అడవి బిడ్డలకు సహాయం చేయడంలో మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా ట్రస్ట్ అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News