స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై యుద్ధం తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరిక. సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరము లేదంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని ఆమె ఐఏఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా రాయపర్తిలో సంఘం నేతలతో కలిసి కళ్ళకు నల్లగంతులు కట్టుకొని వినూత్న నీతిలో నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా ఎన్నికలకు వెళితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై యుద్ధం తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగిన వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాని ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలిత సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మొంబర్ స్మితా సబర్వాల్ పై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని ఆమె ఐఏఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘం నేతలతో కలిసి కళ్ళకు నల్లగంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ దేశంలో రాష్ట్రంలో వికలాంగులకు ఉన్న హక్కులను చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అట్టడుగున్న ఉన్న వికలాంగుల సమాజాన్ని ఆదుకునేందుకు పోటీ పడవలసిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్వరించేందుకు పోటీపడుతున్నాయని వికలాంగుల సమాజాన్ని అవమానపరిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల మేరకు వెంటనే కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసీ రిమాండ్ కు తరలించాల్సి ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్న తీరే ఓ ఉదాహరణ అని స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకునేంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆమె 24 గంటలు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని స్వష్టం చేశారు సంఘం రాయపర్తి మండల అధ్యక్షుడు ఇస్లావత్ బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ షరీఫ్ వర్ధన్నపేట మండల అధ్యక్షులు జేట్టబోయిన శ్రీనివాస్ సంఘం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు