E-PAPER

అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం.. ఐక్యతే మన బలం!

చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ కార్యకర్తల స్పష్టీకరణ

శ్రీకాకుళం జిల్లా, పలాస | వై 7 న్యూస్

పలాస మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పలాస నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు స్పష్టం చేశారు.

చైర్మన్ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, అందరం ఐక్యంగా నిలబడి ఎంపికైన అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేస్తామని వారు తెలిపారు.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతామని, అధిష్టానం నిర్ణయానికి సంపూర్ణ మద్దతు అందిస్తామని పేర్కొన్నారు.

పార్టీ నిర్ణయమే అందరి నిర్ణయం.. ఐక్యతే విజయానికి పునాది!

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!