E-PAPER

వాట్సాప్‌లో అద్దిరిపోయే ఫీచర్..!

వాట్సాప్ యూజర్లు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “మెసేజ్ షెడ్యూల్” ఫీచర్ ఎట్టకేలకూ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఇకపై మీరు ఎంత బిజీగా ఉన్నా, లేదా ఫోన్ పక్కన లేకపోయినా అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు పంపాలనుకునే మెసేజ్‌ను ముందే షెడ్యూల్ చేసి పెట్టుకుంటే చాలు, అది మీరు అనుకున్న టైమ్‌కే ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది.

వాట్సాప్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.40.7లో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. WABetaInfo అందించిన వివరాల ప్రకారం, కొంతమంది బీటా యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా అభివృద్ధిలో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుత బీటా టెస్టింగ్ పూర్తయ్యాక, త్వరలోనే వినియోగదారులందరికీ స్టేబుల్ వెర్షన్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ ప్రత్యేకతలు ఇవే:

  • మల్టీమీడియా సపోర్ట్: కేవలం టెక్స్ట్ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, వీడియోలు, లింక్‌లను కూడా ముందే షెడ్యూల్ చేసుకోవచ్చు.
  • గ్రూప్ చాట్స్: ఈ ఫీచర్ ఇండివిడ్యువల్ (వ్యక్తిగత) చాట్‌లోనే కాదు, గ్రూప్ చాట్‌లో కూడా పనిచేస్తుంది.
  • ఆఫ్‌లైన్ వర్కింగ్ మ్యాజిక్: ఇందులో అసలు మ్యాజిక్ ఏంటంటే.. మీరు సెట్ చేసిన టైమ్‌కు మీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఆఫ్‌లో ఉన్నా, లేదా యాప్ క్లోజ్ చేసి ఉన్నా సరే మెసేజ్ ఆటోమేటిక్‌గా డెలివరీ అయిపోతుంది.
  • పూర్తి సురక్షితం: షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ (End-to-End Encrypted) గానే ఉంటాయి.

టైమ్ లిమిట్?: మీరు పంపాలనుకునే సమయానికి కనీసం 10 నిమిషాల ముందు నుంచి, గరిష్ఠంగా రెండు వారాల ముందు వరకు ఎప్పుడైనా మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేయడం ఎలా? వాట్సాప్ మెసేజ్ షెడ్యూల్ ఫీచర్ జీమెయిల్ షెడ్యూల్ మాదిరిగానే పనిచేస్తుంది.

వాట్సాప్‌లో మెసేజ్‌లను ముందే షెడ్యూల్ చేసుకునే విధానం (ఫొటో క్రెడిట్: WABetaInfo)
  1. టెక్స్ట్ మెసేజ్ కోసం: చాట్ బాక్స్‌లో మెసేజ్ టైప్ చేసి, “సెండ్” (Send) బటన్‌పై లాంగ్ ప్రెస్ (నొక్కి పట్టి) చేస్తే షెడ్యూల్ ఆప్షన్ స్క్రీన్ కనిపిస్తుంది. అక్కడ మీకు కావాల్సిన డేట్, టైమ్ సెట్ చేసుకోవచ్చు.
  2. ఫొటో లేదా వీడియో కోసం: గ్యాలరీలోకి వెళ్లి ఫైల్‌ను సెలెక్ట్ చేసుకుని, ఆ తర్వాత “సెండ్” బటన్‌పై లాంగ్ ప్రెస్ చేసి టైమ్ సెట్ చేసుకోవాలి. డ్రాయింగ్ ఎడిటర్ ద్వారా ఫొటోను ఎడిట్ చేసి, క్యాప్షన్ యాడ్ చేసిన తర్వాత కూడా షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.

షెడ్యూల్డ్ మెసేజ్‌లను మేనేజ్ చేయడం ఎలా?: మీరు ఏ చాట్‌లో మెసేజ్ షెడ్యూల్ చేశారో, ఆ చాట్ ఇన్ఫో (Chat Info) స్క్రీన్‌లోకి వెళ్లి “షెడ్యూల్డ్ మెసేజెస్” (Scheduled messages) సెక్షన్‌లో వాటిని చూడవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే అక్కడి నుంచే వాటిని డిలీట్ చేయవచ్చు కూడా. మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను అది డెలివరీ కాకముందే డిలీట్ చేస్తే, అవతలి వ్యక్తికి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు. అలాగే మీరు మెసేజ్ పంపాలనుకున్న సంగతి కూడా వారికి తెలియదు.

ఇదిలా ఉండగా వాట్సాప్ ఇటీవలే టీనేజర్ల కోసం “పేరెంటల్ కంట్రోల్స్” ఫీచర్​ను తీసుకొచ్చింది. దీని ద్వారా పిల్లల ప్రైవసీకి భంగం కలగకుండానే తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించవచ్చు. అలాగే భారతీయ వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతా నుంచే నేరుగా విద్యుత్, నీరు, గ్యాస్, ఫోన్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి అన్ని రకాల గృహ బిల్లులను చెల్లించేందుకు వీలుగా “బిల్ పేమెంట్స్​” ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!