E-PAPER

లోకేష్, అల్లు అర్జున్ సినిమా నుండి బిగ్ అప్డేట్..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘ఏఏ23’పై ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరగ్గా.. దర్శకుడు లోకేశ్‌ తాజా పోస్టుతో ఆ ఊహాగానాలకు తెరదించారు. త్వరలోనే ఆసక్తికరమైన వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

లోకేశ్‌ కనగరాజ్‌ సోమవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అల్లు అర్జున్‌తో మాట్లాడుతున్న ఫొటోను పంచుకున్నారు. ‘‘ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ త్వరలోనే వస్తున్నాయి’’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో మళ్లీ అంచనాలు పెరిగాయి.

అల్లు అర్జున్‌, లోకేశ్‌ కనగరాజ్‌ తొలిసారి కలిసి పనిచేయనున్నట్లు ఈ ఏడాది జనవరిలో అధికారికంగా ప్రకటించారు. ఆ సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అందులో ఓ సింహం స్థిరంగా నిలబడగా.. దాని చుట్టూ కొన్ని నక్కలు తిరుగుతూ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తాయి. ఈ వీడియో సినిమా కథ గురించి పెద్దగా వివరాలు వెల్లడించకపోయినా.. ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెంచింది.

‘ఏఏ23’ను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించనున్నారు. గతంలో అల్లు అర్జున్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ ‘పుష్ప’ను కూడా ఈ నిర్మాణ సంస్థే తెరకెక్కించింది. అయితే ‘ఏఏ23’ కథ, ఇతర నటీనటులు, చిత్రీకరణ వివరాలపై అధికారికంగా మరింత సమాచారం రావాల్సి ఉంది.

మరోవైపు అల్లు అర్జున్‌ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. అల్లు అర్జున్‌, దీపికా తొలిసారి జంటగా కనిపించనున్న ఈ సినిమాపైనా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ 44వ పుట్టినరోజు సందర్భంగా ‘రాకా’ను అధికారికంగా ప్రకటించడంతో పాటు ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఇప్పుడు ‘ఏఏ23’పై లోకేశ్‌ చేసిన తాజా ప్రకటనతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్న ఉత్కంఠ మొదలైంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!