పత్తికొండ ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేత
పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పత్తికొండ ఎన్నికల అధికారి, ఆర్డీవోకు నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లు, భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పత్తికొండ మండల కన్వీనర్, మాజీ ఎంపీపీ, రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Post Views: 64









