E-PAPER

బాలిక ఫోటోలు వైరల్ చేసిన ముగ్గురి అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 న్యూస్ తెలుగు

సోషల్ మీడియాలో బాలిక ఫోటోలను వైరల్ చేసి వేధింపులకు పాల్పడిన ముగ్గురిని ఎచ్చెర్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాలికకు తెలియకుండా మొదటి నిందితుడు ఆమె ఫోటోలను తీసి భద్రపరిచాడు. అనంతరం మరో ఇద్దరు నిందితులు ఆ ఫోటోలను వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపించి వైరల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

అరెస్టయిన నిందితులు:

– శ్రీరామ్ (22)
– సురేష్ (23)
– జోషు (21)

సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలను అనుమతి లేకుండా పంచుకోవడం, వాటి ద్వారా వేధింపులకు పాల్పడటం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. బాధితుల గోప్యతను గౌరవించాలని, ఇలాంటి ఫోటోలను ఇతరులకు పంపించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

— Y7 News Telugu | ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!