E-PAPER

రవిచంద్ర మృతి ఘటనపై కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ అరుణ్ కుమార్

కరకగూడెం, అక్టోబర్ 12 (Y7 తెలుగు న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవల నాగారం గ్రామ శివారు ప్రాంతంలో యువకుడు ధారావత్ రవిచంద్ర (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మణుగూరు ఇన్‌చార్జి డీఎస్పీ అరుణ్ కుమార్ తెలిపారు.

సోమవారం ఉదయం 7:30 గంటల సమయంలో కలవల నాగారం గ్రామ శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందిందని డీఎస్పీ వెల్లడించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతి చెందిన వ్యక్తి ధారావత్ రవిచంద్రగా గుర్తించినట్లు తెలిపారు.

రవిచంద్రను ఇమ్రాన్ అనే వ్యక్తి గత రాత్రి తనతో తీసుకెళ్లి హత్య చేసి ఉంటాడనే అనుమానాన్ని మృతుడి తల్లి ఫిర్యాదులో వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీఎస్పీ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

రిపోర్టర్: దిలీప్ కుమార్, కరకగూడెం మండలం
Y7 NEWS TELUGU – ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!