E-PAPER

మణుగూరులో రోడ్డుపై ఇసుక దిబ్బలు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి సాయిబాబా గుడి వరకు రోడ్డుపై ఊడ్చి పోగు చేసిన ఇసుక దిబ్బలను నాలుగు రోజులుగా తొలగించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్డుపై ఇసుక దిబ్బలు అలాగే ఉండటంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డుపై ఉన్న ఇసుక దిబ్బలను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్, ఎంపీడీవో తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

— Y7 NEWS TELUGU | ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!