E-PAPER

కరకగూడెం మండలంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కరకగూడెం మండలం కలవల నాగారం గ్రామానికి చెందిన బాదావత్ రవిచంద్ర (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. రవిచంద్రకు ఇంకా వివాహం కాలేదని, గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు.

యువకుడి మృతితో కలవల నాగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

— Y7 News Telugu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!