భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | అక్టోబర్ 11, Y7 న్యూస్ తెలుగు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో అక్టోబర్ 12, సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు స్వీకరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
జిల్లా ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై ఫిర్యాదులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
— Y7 NEWS TELUGU









